వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటన
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన…
ముదిగుబ్బ yes9TV
గురువారం ముదిగుబ్బలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించారు.గుంజేపల్లి పరిధిలో సాగు చేసిన కంది పంటను పరిశీలించారు.జూన్ మాసంలో వర్షాధారంగా సాగుచేసిన వేరుశనగ, కంది మరియు ఆముదం పంటలు బెట్టకు గురికాకుండా ఉండేందుకు పొటాషియం నైట్రేట్ అయిదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయవలెనని తెలిపారు.సాళ్ల మధ్యలో కలుపు లేకుండా చూసుకోవాలని సూచించారు.బెట్ట ప్రభావం తగ్గించడానికి వరుసల మధ్యలో మొక్కల సంఖ్యను తగ్గించాలని తెలిపారు. నీటి సదుపాయం ఉన్న రైతులు ఒక తడి పంటకు ఇచ్చుకోవాలని తెలిపారు.ఆగస్టు మాసంలో వర్షం వచ్చినట్లయితే కంది ,పెసర, సజ్జ మరియు జొన్న పంటలు సాగు చేయడానికి అనుకూలమని తెలిపారు. కార్యక్రమం లో కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.భాస్కర్ రెడ్డి,శాస్త్రవేత్త డా. రమేష్ నాయక్, పుట్టపర్తి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. రామసుబ్బయ్య, మండల వ్యవసాయ అధికారి రవీంద్ర, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటన..
