రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కిమ్స్ సవేరాలో 50కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు పూర్తి..

అనంతపురం జిల్లా.

*రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కిమ్స్ సవేరాలో 50కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు పూర్తి*

– *: వినికిడి లోపం ఉన్న మూగ, బధిర చిన్నారులు శస్త్రచికిత్సలను ఉపయోగించుకోవాలి*

– *: జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్*

అనంతపురం, మార్చి 02 :

– *వినికిడి లోపం ఉన్న పిల్లలు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి ఉచితంగా చేస్తున్న కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఈనెల 3వ తేదీన ప్రపంచ శ్రవణ దినోత్సవం (World Hearing Day) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో డా.ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం కింద కిమ్స్ సవేరాలో 50కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు పూర్తి చేయగా, శస్త్రచికిత్సలు పూర్తి చేసుకున్న చిన్నారులకు కిట్లను జాయింట్ కలెక్టర్ పంపిణీ చేశారు.*

– *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో డా.ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం కింద సవేరాలో 50కి పైగా మూగ, బధిర చిన్నారులకు అత్యాధునిక ‘కాక్లియర్ ఇంప్లాంట్’ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషకరమన్నారు. ఖరీదైన సర్జరీలను ప్రభుత్వ సహకారంతో పూర్తి ఉచితంగా అందించడం జరిగిందన్నారు. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా అర్హులైన పిల్లలను గుర్తించి, వారికి శస్త్రచికిత్సలు నిర్వహించి, తద్వారా వినికిడి యంత్రం సహాయం లేకుండానే సహజంగా వినగలిగే శక్తిని కల్పిస్తున్నారన్నారు. మూగ, బధిర చిన్నారులు ఎవరైనా సంప్రదించినా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.*

– *ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, సవేరా హాస్పిటల్ సిఈఓ సిద్ధారెడ్డి, ఈఎన్టి స్పెషలిస్ట్ డా.రాఘవేంద్రరెడ్డి, పీఆర్ గిరి, సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor