శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
- రేపటి నుంచి మూడు రోజులు పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు
- భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమానులో రేపటి నుంచి మూడు రోజులు పాటు శివరాత్రి ఉత్సవాలు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. శివరాత్రి ఉత్సవాలుకు హాజరైన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశాల మేరకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఇప్పటికే టిడిపి శ్రేణులతో కలిసి అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 14, 15 16వ తేదీలలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు పిలుపునిచ్చారు. 15వ తేదీ ఎమ్మెల్యే గారి చొరవతో ఈశా ఫౌండేషన్ వారు కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలో పాల్గొంటున్నారు అని పేర్కొన్నారు.
