రీ-సర్వేలో తప్పులకు తావుండొద్దు: అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ కఠిన ఆదేశాలు.

రీ సర్వే తప్పులు లేకుండా నిర్వహించాలి
*గ్రామ సభలో జాబితాను ప్రదర్శించాలి
*కలెక్టర్ సుమిత్ కుమార్

నాలుగో విడత రీ సర్వే కార్యక్రమం ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాల కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో గురువారం నాలుగో విడత రీ సర్వేపై 14గ్రామాల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ.రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడిల్, ట్రైనింగ్ ఎస్పీ తరుణ్, ల్యాండ్ సర్వే డీడీ జయరాజ్, చిత్తూర్ ఆర్డీవో శ్రీనివాసులు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు సుమిత్ కుమార్ మాట్లాడుతూ… నాలుగో విడత రీ సర్వే కార్యక్రమం 101 గ్రామాల్లో 1,18,360 ఎకరాల్లో జరుగుతోందన్నారు. గుడిపాల, చిత్తూరు రూరల్, వెదురుకుప్పం, కార్వేటినగరం, నగరి, బైరెడ్డిపల్లి, శాంతిపురం, గుడిపల్లి మండలాల రెవెన్యూ అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. ప్రతి రైతు సమక్షంలో రికార్డులను పరిశీలించాలని… గ్రామసభల నిర్వహించాలని జిటి నోటిస్ జారీ చేసి ఈ సర్వే నియమ నిబంధనల మేరకు పూర్తిచేయాలన్నారు. రీ సర్వే భవిష్యత్తులో వివాదరహితంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో పట్టా భూమి, ప్రభుత్వ భూమి, డీకేటి భూమి, మొదలైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సర్వేయర్లను ఆదేశించారు. గ్రామాల్లో వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు, మండల సర్వేర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. భూవివాదాలతో రైతులు, అధికారులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భావితరాలకు నిర్ధిష్టమైన హక్కు పత్రాలు అందజేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రీసర్వే ప్రారంభించిందన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ మాట్లాడుతూ… రీసర్వేలో పొరబాట్లు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పక్కా కొలతలతో భూములను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా రీసర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఏవైనా తప్పులు జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor