Latest Posts

గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: నల్లమాడ ఎస్సై సతీష్ కుమార్ హెచ్చరిక

గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు.
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లమడ ఎస్సై సతీష్ కుమార్ హెచ్చరించారు. శనివారం మండల పరిధిలోని గోపేపల్లి గ్రామంలో ఎస్సై సతీష్ కుమార్ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో ప్రజలందరూ ప్రశాంతంగా జీవించాలని, ఎటువంటి గొడవలకు అల్లర్లకు పాల్పడకూడదని తెలిపారు. ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి గొడవలు అల్లరిలో లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. అలాగే గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. యువత గొడవలకు దూరంగా ఉండాలని, గొడవల వల్ల అందమైన భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటారని ఎస్ఐ తెలిపారు. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామంలో చాంద్ బాషా అనే వ్యక్తిని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు రిమాండ్ తరలించామని తెలిపారు. గ్రామంలో పేకాట అక్రమ మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడుతుంటే పోలీసులకు తెలపాలని వారి పేరును గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు.

Posted Under AP
Editor