Latest Posts

నల్లమాడలో ప్రధానోపాధ్యాయులకు ‘విద్యాంజలి’పై అవగాహన సదస్సు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం: విద్యాంజలి ఒకరోజు శిక్షణా కార్యక్రమం
విద్యాంజలి పై ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నల్లమాడ నందు నిర్వహించడం జరిగింది. ఇందులో మండల విద్యాధికారి సురేష్ బాబు మాట్లాడుతూ విద్యాంజలి పాఠశాల స్వచ్ఛంద సేవ కార్యక్రమం. ఈ పోర్టల్ లో పాఠశాలల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని కల్పిస్తుందని తెలిపారు విద్యాంజలి పోర్టల్ నందు ప్రతి ప్రభుత్వ పాఠశాల తప్పనిసరిగా రిజిస్ట్రీ లాగిన్ కావాల్సిన కావాలని తెలియజేయడం జరిగింది. ఈ పోర్టల్ లో పాఠశాలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ మెటీరియల్ సైన్స్ లాబ్ మెటీరియల్, పాఠశాలకు అవసరమైన స్టేషనరీ,ఇతర రిపేరులో ఏవైనా ఉంటే వాటి అన్నిటిని కూడా ఆ పోర్టర్లో నమోదు చేయాలని సూచించారు. తద్వారా పాఠశాలకు సహాయం చేయాలనుకునే వాలంటీర్లు అనగా భారతీయ పౌరులు ప్రవాస భారతీయులు కంపెనీలు,దాతలు పూర్వ విద్యార్థులు ఆ పాఠశాలలకు సహాయం చేసే అవకాశం ఉందని తెలియజేశారు.అదేవిధంగా కాంప్లెక్స్ క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యాంజలి హోటల్లో పాఠశాలకు అవసరమైనటువంటి సదుపాయాలు కానీ, సేవలు గాని నమోదు చేయవలసిందిగా తెలియజేశారు. తర్వాత రిసోర్స్ పర్సన్స్ శశి కుమార్ రెడ్డి నరసింహులు ప్రధానో పాధ్యాయులకు విద్యాంజలి ఫోటో ఏ విధంగా రిజిస్టర్ కావాలి, లాగిన్ కావాలి, పాఠశాలకు అవసరమైన సేవలను మౌలిక సదుపాయాలు ఏ విధంగా నమోదు చేయాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సురేష్ బాబు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, MIS రఫీ,CRMT లు మదర్ అలీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor