తాడిమర్రి ఫిబ్రవరి 6:-(YES9TV) సంత్ రవిదాస్ జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహణ
సంత్ రవిదాస్ జయంతి వారోత్సవాల సందర్భంగా తాడిమర్రి మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు భాస్కర్ నాయుడు, ఆరవేటి ఆనంద్, ఎస్సీ మోర్చా నాయకులు వీరాంజినేయులు, గంగయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోపాల్ రెడ్డి, కొంకా నాగార్జున పాల్గొని సంత్ రవిదాస్ గారి జీవితం, ఆయన సమాజానికి చేసిన సేవలను గుర్తుచేశారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో రమణ, బిల్లే చంద్ర, గంగాధర్, వీర రాఘవ, తోట్లి పెదయ్య, రాజశేఖర్, వెంకట నాయుడు, నారాయణ స్వామి, గంగరాజు, కుళ్లాయప్ప, రంగయ్య, శివారెడ్డి, రామాంజి, చంద్రబాబు నాయుడు, తేజ, పవన్, కాటమయ్య, నరేష్, కె. రాముడు, సుధాకర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తాడిమర్రిలో ఘనంగా సంత్ రవిదాస్ జయంతి వారోత్సవాలు.. నివాళులర్పించిన బీజేపీ నాయకులు
