తాడిమర్రి ఫిబ్రవరి 6:-(YES9TV) మండల పరిధిలోని నారసింపల్లి గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమం నందు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడమైనది. ఈ శిబిరంలో భాగంగా వృద్ధులకు మానసిక జబ్బులు, కంటి సమస్యలు, దంత పరీక్షలు, రక్తపోటు, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ బి ఎస్ కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. సునీల్, మానసిక వైద్యులు డా. విష్ణు, కంటి వైద్యులు డా. వై. రాముడు, తాడిమర్రి వైద్యులు డా. ఏ. గోవర్ధన్ నాయుడు పాల్గొని వైద్య సేవలు అందించారు. అలాగే పీహెన్ లక్ష్మీదేవి, ఆప్తల్మిక్ ఆఫీసర్ ఊరుకుందప్ప, ఎంపీహెస్ రామ్ కుమార్, ఎమ్మెల్ హెచ్ పి అలేఖ్య, ఎం పి హెచ్ ఎ జానకిరామ్, ఏఎన్ఎం రేష్మా, ఆశా కార్యకర్తలు ఈ శిబిరంలో చురుకుగా పాల్గొన్నారు.
నారసింపల్లి వృద్ధాశ్రమంలో మెగా వైద్య శిబిరం.. వృద్ధులకు ఉచితంగా మందుల పంపిణీ
