Latest Posts

నిషేధిత జాబితా (22A) నుండి ఇంటి స్థలాల తొలగింపు.. లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేసిన మంత్రి సత్యకుమార్

ముదిగుబ్బ ఫిబ్రవరి 6:- (YES 9TV):- మండలంలో తాతల కాలం నాటి పాత పట్టా భూములు గత కొన్నేళ్లుగా 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చబడి అవి నేటి వరకు రిజిస్ట్రేషన్ కు నోచుకోకుండా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న తరుణంలో
ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వాటిని రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పలువురు లబ్ధిదారులకు నిషేధిత జాబితా తొలగింపు ఉత్తర్వు కాపీలను అందజేశారు, దీంతో మండలంలో దీర్ఘకాలికంగా నెలకొన్న పాత పట్టా భూములు, ఇల్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ సమస్యకు అడ్డంకులు తొలగిపోవడంతో గత కొన్నేళ్లుగా ఈ సమస్యపై నిరంతర పోరాటం చేస్తున్న సిపిఐ పార్టీ నాయకుల కృషి ఫలించినట్లు అయిందని ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు, ఈ ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ పార్టీ స్థానిక నాయకులు శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఆర్డిఓ మహేష్ ల ఆధ్వర్యంలో జరిగిన నిషేధిత భూముల తొలగింపు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు, ఈ కార్యక్రమం అనంతరం సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు మంత్రి సత్య కుమార్ తో మాట్లాడుతూ ఎటువంటి విజ్ఞాపక పత్రాలు, షరతులు లేకుండా పట్టణంలోని 907, 908 సర్వే నెంబర్లలోని 13.60 ఎకరాల భూములను నిషేధిత జాబితా తొలగించిన నేపథ్యంలో మండల వ్యాప్తంగా 22 ఏ నిషేధిత జాబితా లో చేర్చబడిన వేల సంఖ్య లో ఉన్న వ్యవసాయ భూములను, ఇళ్ల స్థలాలను కూడా ఇదే మాదిరిగా ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించి
ఆ భూములను కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా రిజిస్ట్రేషన్ కు నోచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు మంత్రికి వినతి పత్రం అందజేశారు, ఈ కార్యక్రమానికి స్థానిక సిపిఐ నాయకులు తిప్పయ్య, రాధాకృష్ణ, కుర్ర నాయుడు, లింగుట్ల వెంకట్ రాముడు, ఎల్ రామకృష్ణ, మల్లాది లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు,

Posted Under AP
Editor