- విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవాలి
- యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకుల పైన దాడుల?
- మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమంగా ఫీజుల దోపిడీ చేస్తుందని ఫైన్ వేసిన ప్రభుత్వం
*ఉరవకొండ:: విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వెంటనే రద్దు చేయాలి AIFDS,AISA,PSU,YSRSU విద్యార్థి సంఘాలఆధ్వర్యంలో నిరసన చేసారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్షుడు నందు,ఐసా నియోజకవర్గం కార్యదర్శి వినయ్ నాయక్, వైయస్సార్ స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు పురుషోత్తం,పిఎస్యునియోజకవర్గం అధ్యక్షులు తులసి వారు మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ జిల్లా నాయకులు వినోదులను మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థి నాయకుల పైన దాడి చేసి కిడ్నాప్ చేయడానికి తీవ్రంగా ఖండించారు.గత కొన్ని నెలలుగా తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజుల దోపిడీ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో 26 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ సిస్టం చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 16 లక్షల రూపాయలు ఈ మధ్యకాలంలోనే యూనివర్సిటీకి జరిమానా విధించింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యుల తీరు మారకపోవడంతో ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కార్లయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యులు వసూలు చేస్తున్న అక్రమ ఫీజులు అరికట్టాలని ధర్నా చేస్తున్న నాయకులను వారి దీవచక్ర వాహనం పడదోసి వాళ్లను కొట్టి కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం దారుణం అన్నారు మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు దురాగాతలను ఖండించారు.. విద్యార్థులకు విద్యార్థి సంఘం నాయకులకు ఏమాత్రం ప్రాణహాని జరిగిన అందుకు మోహన్ బాబే పూర్తిగా బాధ్యత వహించాలని హెచ్చరించారు.. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత జరుగుతున్న ఏమాత్రం పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్న అక్రమాల పైన విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారంలోకి వచ్చి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అటువైపు కన్నెత్తి చూడకుండా రాష్ట్రంలో రెడ్ బుక్కు వెంటపెట్టుకొని తిరుగుతున్నట్లు ఉందన్నారు ప్రైవేట్ యూనివర్సిటీ లోపాలు అక్రమాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు.తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సంఘటన పైన తీసుకోవాలని అదేవిధంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకుల పైన దాడులు చేసి కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారిని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ నాయకులు తరుణ్, మధు, ఐసా నాయకులు, మనోజ్, కార్తీక్, పి స్ యూ నాయకులు వంశీ, శివ, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు
