Latest Posts

ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి: ఎంపీడీవోకు సిపిఎం వినతి

ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలి

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమడ మండలం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధంగా కొనసాగించాలంటూ సిపిఎం మండల కార్యదర్శి గోవింద్ తోపాటు సిపిఎం నాయకులు కలిసి స్థానిక మండల కేంద్రంలోని ఇంచార్జ్ ఎంపీడీవో గజ్జల శ్రీనివాసులు రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గోవింద్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జి రామ్ జి పథకాన్ని రద్దు చేస్తూ గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ పని దినాలు పెంచాలని,పని వేతనం కూడా పెంచాలని,అలాగే పల్లెలు నుండి పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని,అలా వలసలు పోకుండా నివారించాలని, గ్రామాల్లో పనులు కల్పించాలని,పనిముట్లు పంపిణీ చేయాలని,పని దినాల సంఖ్య పెంచడం వలన వలసలు పోకుండా నివారించవచ్చానని, అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా పెట్టిన మామిడి చెట్లకు పెండింగులో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని,అలాగే ఉపాధి హామీ ద్వారా పొలాల్లోకి దారులు,కాలవలు,శుభ్రం చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోవింద్, సిపిఎం నాయకులు రైతు సంఘం నాయకుడు బి. మాధవరెడ్డి,ఎస్.గంగులప్ప పి.మల్లికార్జున,పి.మారుతి,యం.మల్లమ్మ,టి.చిన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor