ముదిగుబ్బ ఫిబ్రవరి 5 :- (YES 9TV):- ముదిగుబ్బ మండలంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న భూసమస్యలను పరిష్కరించాలని సిపిఐ పార్టీ నాయకులు గురువారం మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన మహేశ్వర్ రెడ్డిని కలిసి విన్నవించారు,
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నూతన తహసిల్దార్
మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మాట్లాడుతూ మండలంలో నెలకొన్న చుక్కల భూములు,
ఫ్రీ ఓల్డ్ భూముల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు, ముఖ్యంగా 1954 ముందు ఉన్న ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో చేర్చబడి చుక్కల భూములుగా నమోదయి రిజిస్ట్రేషన్కు నోచుకోకుండా పోయాయి అన్నారు, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ భూముల సమస్యను పరిష్కరించుటలో భాగంగా వాటికి సంబంధించిన రికార్డుల్లో ఏదో ఒకటి మాత్రమే రైతుల నుంచి తీసుకొని 22 ఏ నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించి అవి రిజిస్ట్రేషన్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో అందుకు భిన్నంగా స్థానిక రెవెన్యూ అధికారులు రైతులకు కష్టసాధ్యమైన Rh కాఫీ, మాన్యువల్ Ec,
ఆన్ లైన్ Ec తదితర అధిక వ్యయంతో కూడుకున్న వివిధ రికార్డులను అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కనుక ఆ రికార్డులతో సంబంధం లేకుండా 1954 ముందు ఉన్న పాత పట్టా భూములన్నీ తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యేవిధంగా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు కోరారు, ఈ మేరకు స్పందించిన నూతన తాసిల్దార్ మాట్లాడుతూ రైతుల ఎదుర్కొంటున్న ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు,
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య తో పాటు స్థానిక నాయకులు వెంకటేశ్వర నాయక్,లింగుట్ల వెంకటరాముడు, రైతు సంఘం నాయకులు గంగిరెడ్డిపల్లి నాయుడు తదితరులు పాల్గొన్నారు,
భూసమస్యలు పరిష్కరించి రైతులను ఆదుకోండి: ముదిగుబ్బ కొత్త తహసీల్దార్‌కు సీపీఐ నాయకుల విన్నతి
