పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ధర్మవరం: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) కింద బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను నేడు (29-01-2026) ధర్మవరం లోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండలం ఎస్. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గణపతి ప్రణయ్ సిద్ధార్థ్ (S/o నాయుడు) కు రూ.1,05,108/- చెక్కు, ముదిగుబ్బ ఎస్సీ కాలనీకి చెందిన జి. పుష్పలత (W/o శ్రీనివాసులు) కు రూ.43,734/-, ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్. ప్రమీల (W/o ఫక్కిర్ రెడ్డి) కు రూ.67,579/-, చిత్రవారిపల్లి గ్రామానికి చెందిన కె. చిన్న రాజా (S/o గంగన్న) కు రూ.1,06,624/-, జొన్నల కొత్తపల్లి గ్రామానికి చెందిన కొంక ఆంజనేయులు (S/o చిన్న కుల్లాయప్ప) కు రూ.30,785/- విలువైన చెక్కులను అందజేశారు.
మొత్తంగా ముదిగుబ్బ మండలానికి రూ.3,53,830/- విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను శ్రీ పరిటాల శ్రీరామ్ గారి చేతుల మీదుగా బాధితులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలు, అభాగ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్‌తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
YES9 TV