ముదిగుబ్బ జనవరి 28:- (YES 9 TV):- జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సౌత్ స్టేట్స్ గౌరవాధ్యక్షులు బాసినేని వెంగమేష్ చౌదరి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు బుధవారం ముదిగుబ్బ పట్టణంలో స్థానిక దొరిగల్లు రోడ్డులో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ విద్యార్థినులకు అమలవుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు, ఈ సందర్భంగా వారు హాస్టల్లో బాలికలకు ఏర్పాటుచేసిన పడకగదులను, బాత్రూములను, వంట గదులను, నీటి సౌకర్యం లో భాగంగా ఏర్పాటు చేసిన సంపును
తదితర వాటిని పరిశీలించడంతోపాటు భోజనానికి తాజా వంట సరుకులను, కూరగాయలను వాడుతున్నారో లేదోనని కూడా వారు నిశితంగా ఆరా తీసిన అనంతరం అక్కడ బాలికలకు అన్ని విధాలా సౌకర్యాలు అమలవుతున్నాయని
సంతృప్తి వ్యక్తం చేస్తూ వారు అక్కడి సిబ్బందిని అభినందించారు, కాగా సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ వెంగమేష్ చౌదరి లు
ఆ హాస్టల్ సందర్శించిన సమయంలో అక్కడి వార్డెన్ సరస్వతి అందుబాటులో లేకపోవడంతో వారు అక్కడి నుంచే ఫోను ద్వారా ఆమెతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ హాస్టల్లో సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయని భవిష్యత్తులో కూడా ఇక్కడి బాలికలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు ఆమెకువిన్నవించారు,
ముదిగుబ్బ బీసీ బాలికల హాస్టల్ తనిఖీ: వసతులపై వెంగమేష్ చౌదరి, చల్లా శ్రీనివాసులు సంతృప్తి!
