శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం: ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్, ఎస్పీ

శ్రీ సత్య సాయి జిల్లా

జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు…

జాతీయ పతాకావిష్కరణ చేసిన…

జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారు,

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపియస్ గారు.

జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారితో కలిసి పెరేడ్ వీక్షణ చేసి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారు సందేశాన్ని చదివి వినిపించారు.

విధులలో ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు.

* ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, డిఎస్పీలు, విజయ్ కుమార్, నర్సింగప్ప, శ్రీనివాసులు, ఎస్బిసిఐ వెంకటేశ్వర్లు, సిఐలు, ఎస్సైలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor