శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని చెరువువాండ్ల పల్లి గ్రామంలో ఉన్నటువంటి FPO కార్యాలయం నందు నిర్వహించిన కందులు కొనుగోలు కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి గారు అబ్దుల్ హక్ మాట్లాడుతూ నల్లమాడ మండలంలోని కంది పంట సాగు చేసిన రైతులు తాము వేసిన పంటను అమ్ముకోవడానికి సంబంధిత రైతు సేవా కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకుని చెరువువాండ్ల పల్లి నందు గల FPO కార్యాలయం నందు తమ పంటను అమ్ముకోవచ్చని తెలియచేశారు. అదేవిధంగా రైతులు తమ పంటను విక్రయానికి తీసుకుని వచ్చే సమయంలో తేమ శాతం 12% లోపు ఉండేలా చూసుకోవాలని తెలియచేశారు. ప్రభుత్వం కంది పంటకు ప్రస్తుతం క్వింటా కు గాను 8000/- రూపాయల ధరను నిర్ణయించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గారు, మండల టిడిపి నాయకులు అయినటువంటి శంకర్ గారు నాగభూషణం గారు మరియు ఎంపీఈవో విజయ నాయక్ మరియు ఎఫ్ పి ఓ సిబ్బంది రైతులు పాల్గొన్నారు
నల్లమాడలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం: రైతులకు క్వింటాకు రూ. 8,000 మద్దతు ధర
