బాల్యవివాహాల వలన బాలికలు భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిపిఓ మహేశ్వర పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా నల్లమడ మండలంలోని శిరిడి సాయిబాబా మందిరంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గురువారం బాల్య వివాహ ముక్తభారత్ పై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకూడదని, దీనివలన భవిష్యత్తులో వారు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారితో బాల్యవివాహాలు జరిపించము అని ప్రతిజ్ఞ చేపించారు. కార్యక్రమంలో నల్లమాడ ఇన్చార్జ్ ఎంపీడీవో, ఓ ఆర్ డబ్ల్యు మేఘన, సూపర్వైజర్ సత్యవతి మరియు, అంగన్వాడి టీచర్లు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు లేని సమాజమే లక్ష్యం: డిపిఓ మహేశ్వర్
