Latest Posts

ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి -కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను అధికారులు నిర్ణీత గడువులోపు నాణ్యంగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి 113 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ… అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం చూపాలన్నారు. అర్హులైన దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, పారదర్శకంగా పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డీఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor