Latest Posts

అడవి బ్రాహ్మణపల్లి తాండలో శ్రీ మారెమ్మ తల్లి జాతర: పల్లకి మోసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ముదిగుబ్బ జనవరి 13: (YES 9 TV):

  • అడవి బ్రాహ్మణపల్లి తాండలో శ్రీ మారెమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
  • మారెమ్మ తల్లి జాతరలో పల్లకి సేవ చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ముదిగుబ్బ, జనవరి 13:– (YES 9 TV): ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలంలోని అడవి బ్రాహ్మణపల్లి తాండ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ మారెమ్మ తల్లి జాతర మహోత్సవంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారికి విశేష పూజలు అర్పించారు. అనంతరం సంప్రదాయ పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలతో కలసి జాతర ఉత్సవంలో భాగమయ్యారు. గ్రామ ప్రజలు సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షిస్తూ తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ విధమైన జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని మంత్రి పేర్కొన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ జాతర గ్రామ ఐక్యతకు, సామాజిక సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇటువంటి సంప్రదాయ వేడుకలు యువతకు మన మూలాలను గుర్తు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, గ్రామాల సంప్రదాయ సంస్కృతిని కాపాడటానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు మంత్రివర్యులను ఘనంగా ఆహ్వానించి, సంప్రదాయ రీతిలో సత్కరించారు.

Posted Under AP
Editor