ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో.. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కదిరి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు
శ్రీ చందు గారు మాట్లాడుతూ…
స్వాతంత్ర పోరాటంలో.. దేశ రక్షణలో ముస్లింల పాత్ర చాలా ప్రధానమైందని వారి ప్రాముఖ్యతను భారత సమాజం గుర్తించాలని మీరు తెలియజేశారు. రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు ముస్లింల జనాభా దామాషా ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా సముచిత స్థానం కల్పించకుండా
కేవలం కంటి తుడుపు పద్ధతిలో అక్కడక్కడ రాజకీయ సీట్లు ఇస్తున్నారని రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని వీరు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలు మాత్రమే ముస్లింలు పరిమితం కావడం చాలా బాధాకరమని
వారి జనాభా దామాషా ప్రకారం 13 14 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని,
ఐదుగురు ఎంపీలుగా ఉండాలని వీరు డిమాండ్ చేశారు.
ముస్లిం క్రిస్టియన్లకు మతపరమైన దాడుల పట్ల ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మదనపల్లెలో ముస్లిం క్రిస్టియన్ల సామాజిక సదస్సు 17-1-2026న జరుగుతుందని ఈ కార్యక్రమానికి కదిరి పట్టణంలోని ముస్లిం ప్రముఖులందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ముస్లిం ఫెడరేషన్ మహమ్మద్ గారు,
ముస్లిం ఐక్యవేదిక ఖలీల్ సయ్యద్ గారు, జాఫర్ పులి గారు, వాహిద్, జరీనా బి, గార్లతోపాటు, శివశంకర్,భాను ప్రకాష్, కుప్పం శివకుమార్ తో పాటు ముస్లింలు పాల్గొన్నారు.
