Latest Posts

శ్రీ పులిగుంటేశ్వరస్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మహాసముద్రం ఫౌండేషన్ మరియు మహాసముద్రం దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించు ఈ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ. 30 వేలు, రన్నర్ జట్టుకు రూ. 15 వేలు సంక్రాంతి పండుగ రోజున చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర రెడ్డి, శ్రీ పులి గుంటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ మహాసముద్రం ప్రతాప రెడ్డి, ఎంపీపీ మహాసముద్రం హేమలత సురేష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం జరుగుతుందని నిర్వాహకులు మహాసముద్రం దీపు రెడ్డి, వి. హేమచంద్ర, జి. శ్రీధర్ తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంటులో మొత్తం 37 టీంలు తలపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటిపల్లె సర్పంచ్ ముణిరత్నం రెడ్డి, మాజీ సర్పంచ్ గోవింద రెడ్డి ,టి ఆనందం రెడ్డి, ప్రసాద్, సి వెంకటేసులు, దుర్గ ప్రసాద్, టీ. నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
YES9 TV