జనవరి 1న హత్యకు గురైన కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లికి చెందిన మాదినేని మహేష్ చౌదరి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డును, మృతుని స్కూటీని కొత్తచెరువు పోలీసులు బుధవారం హంద్రీనీవా కాలవ నుండి వెలికి తీశారు. ఈనెల 1న హత్యకు గురైన మహేష్ మృతదేహం పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరున్న హంద్రీనీవా కాలంలో లభ్యమైన విషయం తెలిసిందే. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బుధవారం ఇద్దరు ముద్దాయిలని సంఘటన స్థలానికి తీసుకువచ్చి మృతిని బైక్ ను. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డు ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాల గురించి త్వరలో పోలీసులు పాత్రికేయుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది
మహేష్ చౌదరి హత్య కేసు: హంద్రీనీవా కాలువలో హత్యకు వాడిన రాడ్, స్కూటీ లభ్యం
