జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఇందిరా గారిచే “మంచి స్పర్శ-చెడు స్పర్శ” అంశంపై అవగాహన.
కదిరి పట్టణంలోని స్థానిక మొదటి వార్డు బాలికోన్నత మున్సిపల్ పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు శ్రీ వరప్రసాద్ రాజు గారిచే ఏర్పాటుచేసిన “మంచి స్పర్శ-చెడు స్పర్శ”అవగాహన కార్యక్రమ సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఇందిరా గారిచే విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. విద్యార్థులు తమపై జరిగే అనుచిత ప్రవర్తనను గుర్తించి వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని, మంచి “స్పర్శ-చెడు స్పర్శల” మధ్య తేడాలను గమనించాలని సూచించారు. ఈ అంశాలను ఉదాహరణలతో వివరించి బాలికలలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా వారు సందేశాన్ని ఇచ్చారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థినుల భద్రతకు ఎంతో అవసరమని పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సమావేశంలో కదిరి మహిళ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీమతి భువనేశ్వరి గారు మోడల్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ ఉపాధ్యాయులు ,రమేష్, వరాలమ్మ, శోభాదేవి, పద్మావతి, రాధాకృష్ణమ్మ, ప్రత్యూష, రమాదేవి, సునీత, సోమశేఖర్, జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,భార్గవ శక్తి టీం సభ్యులు గంగాధర్, చలపతి, శౌఖత్ ఖాన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
