* ముదిగుబ్బ జనవరి 6 :(YES 9 TV): గాండ్లవారిపల్లి లో E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజముద్రతో కూడిన E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ముదిగుబ్బ మండలం గాండ్లవారిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ముదిగుబ్బ తాసిల్దార్ నారాయణస్వామి గారు, రీ-సర్వే డిప్యూటీ తాసిల్దార్ పి. గంగన్న గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సూర్యనారాయణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి రమేష్ బాబు, ముదిగుబ్బ మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ గారు చేతుల మీదుగా రైతులకు E-పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ముదిగుబ్బ మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 02-01-2026 నుంచి 09-01-2026 వరకు రైతులకు కొత్త పట్టాదారు e-పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాస్ పుస్తకాల్లోని తప్పిదాలను సవరించి ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్స్ తో కూడిన పాస్ బుక్స్ ను కూటమి ప్రభుత్వం అందిస్తున్నది. వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో ముద్రించి జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులు చెత్త బుట్టలో పడవేయవచ్చు అని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన తెలుగుదేశం పార్టీ హామీ అనుగుణంగా ట్యాంపరింగ్ కు తావులేని క్యూఆర్ కోడ్ కలిగిన సరికొత్త పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. జగన్ ప్రచారం పిచ్చితో వైసిపి హయాంలో ముద్రించిన పాస్ పుస్తకాల్లోని తప్పుల్ని సరిదిద్దేoదుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 6688 గ్రామాల్లో రీ-సర్వే చేసింది, వెబ్ ల్యాండ్ లోని వివరాలతో 21 లక్షల 80 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజ ముద్ర క్యూఆర్ కోడ్లు ముద్రించింది ఈనెల 9వరకు వీటిని అందించనుంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామ సభ ఏర్పాటు చేసి స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సిబ్బంది స్వయంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఏ రోజున పంపిణీ చేస్తారో రైతులకు అవగాహన కోసం గ్రామాల్లో ముందే చాటింపు వేస్తారు. జగన్ ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాలను రద్దు చేసి ఇప్పుడు సాంకేతికతో కూడిన e-pass బుక్స్ ను అందించనున్నారు. పాస్ పుస్తకం ఇచ్చేటప్పుడు రైతుల వేలిముద్రలతో పాటు రిజిస్టర్ లో సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక వీఆర్వో రైతుల ఈ కేవైసీ ని తప్పకుండా పూర్తి చేయాలని సూచించింది.అని క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు, గ్రామ సర్పంచ్ సూరి, పార్నపల్లి బాలరాజు, మధు, పార్నపల్లి నారాయణస్వామి, రెవిన్యూ, మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
