Latest Posts

హంద్రీనీవా కాలువ ద్వారా చెరువుల నింపుదల: పరిటాల శ్రీరామ్ చొరవతో ముదిగుబ్బలో సర్వే ప్రారంభం

ముదిగుబ్బ జనవరి 5: (YES 9 TV): ఈరోజు ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కొండగట్టుపల్లి పంచాయతీ పరిధిలో మద్దన్న గారి పల్లి గ్రామంలో ఉండే చెరువులకు హంద్రీనీవా కాలువల ద్వారా నీటిని నింపడానికి ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవనీయులు శ్రీ పరిటాల శ్రీరామ్ అన్న గారి చొరవతో మదన్న గారి పల్లి శీలమాండ్లపల్లి ఒడ్డు కింద తండా కోటిరెడ్డిపల్లి గ్రామాలకు సంబంధించి ఐదు చెరువులను నీటిని విడుదల చేయుటకు సంబంధించి హెచ్ ఎన్ ఎస్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ జేఈ గురు ప్రసాద్ గారితో సర్వే చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చినగాని నరసింహ యాదవ్ డీలర్ చినగాని కృష్ణ యాదవ్ పొట్టి పా టి నరేష్ యాదవ్ కృష్ణ యాదవ్ వర్ర పుల్లయ్య యాదవ్ బూతు కన్వీనర్ చిన్నగాని రామాంజనేయ యాదవ్ మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ బిల్లు శేషయ్య యాదవ్ నరేంద్ర యాదవ్ పన్నారు తిరుపాలు గోసి సిద్దయ్య తదితర గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

Posted Under AP
Editor