Latest Posts

కదిరిలో మెడికల్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు: మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు – 5 షాపులకు నోటీసులు జారీ

గౌరవ శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు కదిరి టౌన్ నందు గల వివిధ మెడికల్ షాపులలో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికార్లు మరియు పోలీస్ లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఈ తనిఖీలలో భాగంగా సుమారు 20 మెడికల్ షాపులు తనిఖీలు చేసి మత్తు కలిగించే ఔషధాలు అమ్మే విషయములో వారి రికార్డులను పరిశీలించడం జరిగింది. కొన్ని షాపులలో రికార్డులు పరిశీలించగా వాటి నిర్వహణ సరిగా లేనందున, 05 షాపుల వారికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా ఎక్కడైనా ఎవరైనా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే ఔషధాలు అమ్మినట్లు అయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అని, వారికి హెచ్చరించడం జరిగింది. ఈ తనిఖీ లో కదిరి డిఎస్పి శ్రీ శివనరాయణ స్వామి గారు, అనంతపురం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్, ఓ. వీర కుమార రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్ లు పి. కేశవరెడ్డి గారు, జి మాధవి గారు, కదిరి టౌన్ CI, డి వి. నారాయణ రెడ్డి, కదిరి రూరల్ CI శ్రీ నిరంజన రెడ్డి, కదిరి టౌన్ SI లు శ్రీ బాబజాన్, ధనుంజయ రెడ్డి, శ్రీమతి భువనేశ్వరి మరియు సిబ్బందితో పాటు మరియు వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్
కదిరి టౌన్ పియస్.

Posted Under AP
Editor