ఉపాధి హామీ పని దినాలు 125 రోజులు పెంచడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు. సోమవారం గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీలో వికాసిత్ భారత్ జి రామ్ జి పథకం ప్రారంభోత్సవం పారిశుద్ధ్య గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు ఉపాధి హామీ పనులను 125 రోజులు పొడిగించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలు మరింత అభివృద్ధికి నోచుకుంటుందని అన్నారు. అనంతరం గ్రామంలో పరిశుభ్రత పరిసరాలను గ్రామ ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. అనంతరం వికాసిత్ భారత్ జి రామ్ పథక పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులతో గ్రామాల అభివృద్ధి…..
