Latest Posts

ముదిగుబ్బలో నరకప్రాయంగా మారిన డ్రైనేజీ గుంతలు: అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ ఆగ్రహం

ముదిగుబ్బ, డిసెంబర్ 21 (YES 9 TV): ముదిగుబ్బ మండల కేంద్రంలో డ్రైనేజీ పనుల నిర్మాణం ప్రజలకు శాపంగా మారింది. అసంపూర్తిగా తవ్వి వదిలేసిన గుంతల కారణంగా పట్టణంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన స్థానిక డ్రైనేజీ ప్రాంతాలను పరిశీలించి, అధికారుల మరియు కాంట్రాక్టర్ల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రైనేజీ పనుల కోసం రోడ్ల పక్కన పెద్ద పెద్ద గుంతలు తవ్వి నెలలు గముదిగుబ్బ పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు నత్త నడకన సాగుతూ వాటి కోసం తీసిన గుంతల్లో చాలా చోట్ల నెలలు గడుస్తున్నా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో
ఆ గుంతల్లో వర్షపు నీరు చేరి అది మురికి నీటితో కలుషితమై తీవ్ర దుర్వాసన వస్తుండడమే గాక ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందికరంగా ఉందని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శనివారం ముదిగుబ్బలో ఒక ప్రకటనలో ఆరోపించారు, ఈమేరకు శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్నల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా గత 5 నెలలుగా పట్టణంలో జాతీయ రహదారికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు, కాగా అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉన్నాయని, వర్షాల వలన ఆటంకం ఏర్పడు తోందనే తదితర కారణాలతో చాలాచోట్ల డ్రైనేజీ నిర్మాణం చేయకుండా వాటికోసం తీసిన గుంతలను నెలల తరబడి అలాగే వదిలేయడంతో అవి పట్టణ ప్రజలకు గుదిబండగా మారాయని శ్రీనివాసులు ఆరోపించారు, పట్టణంలో ముఖ్యంగా
జనసంచారం
అధికంగా ఉండే
హై స్కూల్ సర్కిల్, సొసైటీ సర్కిల్, బస్టాండ్ కూడలి, రైల్వే స్టేషన్ రోడ్ల క్రాస్ తోపాటు కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి కదిరి రోడ్డు పెట్రోల్ బంక్ వరకు అక్కడక్కడ చాలాచోట్ల ఈ గుంతలు అలాగే వదిలేయడంతో అవి మురికి కుంటలుగా మారడమే గాక వాహనదారులకు, పాదాచారులకు రాకపోకల విషయమై నరకప్రాయంగా తయారై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు, ఇదిలా ఉండగా ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ డ్రైనేజీ తో పాటు రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండడంతో పట్టణంలో తాగునీటి కోసం ఏర్పాటుచేసిన నీటి కులాయి పైపులు తరచూ ధ్వంసం అవుతుండడంతో గత మూడు నెలలుగా పట్టణంలో తరచూ తాగినటి సమస్య ఏర్పడుతోందని సిపిఐ నాయకులు తెలిపారు, డ్రైనేజీ నిర్మాణం కోసం గుంతల తీసి చాలా చోట్ల వాటిని అసంపూర్తిగా వదిలేయడంతో వాటి వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు, కూటమి నాయకులు ప్రత్యక్షంగా చూస్తున్నా వారు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం దారుణమని సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు, కనుక ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న గుంతల వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తామని
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు ప్రభుత్వానికి తెలియజేశారు,.

Posted Under AP
Editor