ముదిగుబ్బ, డిసెంబర్ 21 (YES 9 TV): శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందూ ధర్మ పరిరక్షణ, ఐక్యత మరియు సంస్కృతిని చాటిచెప్పే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముదిగుబ్బ మండలంలోని హిందూ బంధువులందరికీ నిర్వాహకులు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.
ఈ సమ్మేళనంలో భాగంగా పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులు పాల్గొని హిందూ ధర్మ విశిష్టతను వివరించనున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ కోరుతోంది.
గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికంగా విశేష స్పందన లభిస్తోంది. హిందూ బంధువులంతా ఏకతాటిపైకి వచ్చి మన సాంప్రదాయాలను గౌరవించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
