సమంత-రాజ్ వివాహం ‘భూత శుద్ధి వివాహం’: ఈ యోగ సంప్రదాయం అంటే ఏమిటి?

కథానాయిక సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ జంట సద్గురు స్థాపించిన తమిళనాడులోని కోయంబత్తూరు ఇషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్నారు. ఇషా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయం ఈ వివాహాలకు ప్రసిద్ధి. భారత దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇషా ఫౌండేషన్ ఒకటి. యోగ సంప్రదాయం నుంచి వచ్చిన ఈ పురాతన వివాహ ఆచారాన్ని సద్గురు స్థాపించిన ఇషా ఫౌండేషన్ నిర్వహిస్తోంది.

‘భూత శుద్ధి వివాహం’ అనేది పురాతన యోగ సంప్రదాయం నుంచి వచ్చిన వివాహ ఆచారం. నింగి (ఆకాశం), నేల (భూమి), నీరు, నిప్పు (అగ్ని), వాయువు… అనే పంచభూతాలు తెలుసు కదా! ఈ క్రతువులో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి అవుతారు. ఈ క్రతువులో వధూవరుల దేహాల్లోని పంచ భూతాలను శుద్ధి చేస్తారు.

ఈ భూత శుద్ధి వివాహం యొక్క లక్ష్యం స్త్రీ పురుషుల మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక అనుబంధాన్ని (Deep Physical Bond) సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. సమంత – రాజ్ వివాహం తర్వాత ఈ ‘భూత శుద్ధి వివాహం’ గురించి ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Editor