Latest Posts

VD14 అప్‌డేట్: విజయ్ దేవరకొండ సెట్స్‌లో హాలీవుడ్ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ

విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘VD 14’ సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇది బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో, 19వ శతాబ్దపు (1854 నుంచి 1878 మధ్య కాలం) యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా, ఈ విషయాన్ని ధృవీకరించే ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ది మమ్మీ’, ‘మమ్మీ రిటర్న్స్’ వంటి ఇంగ్లీష్ సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడైన సౌత్ ఆఫ్రికన్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ, ‘VD 14’ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ‘VD 14’ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. సెట్స్‌లో తమిళ నటుడు వినోద్ సాగర్, ఆర్నాల్డ్ కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో లీక్ కావడంతో హాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయం కన్ఫార్మ్ అయింది.

‘VD 14’లో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, ఆయన గెటప్ చాలా కొత్తగా ఉంటాయని టాక్ ఉంది. ఈ సినిమాలో ఆర్నాల్డ్ వోస్లూ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీతో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాగా, ఇప్పుడు ‘మమ్మీ’ విలన్‌ను తీసుకొస్తుండటం విశేషం. త్వరలోనే మేకర్స్ ఈ హాలీవుడ్ స్టార్ ఎంట్రీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Editor