Latest Posts

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ భారీ గుడ్ న్యూస్..! 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు..

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సరికొత్త ఆరోగ్య విధానం తీసుకొచ్చింది. ప్రతి కుటుంబం ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించే యూనివర్సల్ ఆరోగ్యం స్కీమ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చంద్రబాబు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

 

ఏపీలో ప్రతి కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య సేవలు కల్పించేందుకు కీలక అడుగు వేసింది చంద్రబాబు సర్కార్. అమలులో ఉన్న ఆయుష్మాన్‌ భారత్‌-ఎన్టీఆర్‌ వైద్య సేవా పథకంతోపాటు ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకుంది.

 

ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటివరకు హెల్త్ కార్డులు ఇవ్వలేదంటూ చాలామంది ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన చంద్రబాబు కేబినెట్ యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌కు ఆమోద ముద్ర వేసింది.

Posted Under AP
Editor