చివరిగా ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడానికి దాదాపు 4 ఏళ్లు పట్టింది. ఇక ఎట్టకేలకు పలుమార్లు వాయిదా పడుతూ.. జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ తన సమయాన్ని కుదుర్చుకొని మరీ హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రెస్ మీట్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో సినిమా గురించి పలు విషయాలు పంచుకున్న ఈయన.. తన సినిమా జీవితంపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక సినిమాలు చేయను – పవన్ కళ్యాణ్
తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ..” ఇక భవిష్యత్తులో నేను సినిమాలు చేస్తానో.. చేయనో నాకు తెలియదు.. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటాను” అంటూ షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మొత్తానికైతే ఇక భవిష్యత్తులో సినిమాలు చేయను అని డైరెక్ట్ గా చెప్పేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ షాకింగ్ స్టేట్మెంట్ కి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
