అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గుత్తి ఆర్ ఎస్ శనివారం ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ముఖ్య ధ్యేయమని మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుత్తి ఆర్ఎస్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే కూడలి నుండి గుత్తి ఆర్ ఎస్ పురవీధుల్లో మీదుగా ఏవిఆర్ రెహనా,విద్యా సంస్థల విద్యార్థినీ విద్యార్థులతో అవగాహన ర్యాలీ కార్యక్రమం రైల్వే బుకింగ్ కార్యాలయం వరకు చేపట్టారు.

అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో పుర ప్రజలతో గుత్తి మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, విద్యాసంస్థల యాజమాన్య సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రైల్వే ఉద్యోగుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
