Latest Posts

బేస్తవారపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన జక్కా.సుబ్రహ్మణ్యం..

ప్రకాశంజిల్లా బేస్తవారపేట మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడు,ఎన్నికల అధికార ప్రతినిధి మూల.శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంఘ సభ్యులందరూ ఈరోజు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా జక్కా.సుబ్రహ్మణ్యం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తనను బలపరచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు,ఆర్యవైశ్య పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జక్కా.కుమార్, యువజన సంఘం అధ్యక్షుడు విశ్వనాధుని జగదీష్ కుమార్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంటు శేగు.ప్రసాద్,మరియు ఆర్యవైశ్య పెద్దలు, సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor