Latest Posts

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ..?

గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.మాజీ మంత్రులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నుంచి వెళ్లే నేతలే కనిపిస్తున్నారు తప్పిస్తే.. వైసీపీలోకి వచ్చే నేతలు ఎవరూ కూడా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ సీనియర్ నేత వైసీపీ వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ నేత మరెవ్వరో కాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్. తాజాగా ఆయన కర్నూల్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో జగన్‌ను కలిశారు.

 

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు రావడం జరిగింది. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాటలు వినిపించాయి. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వైసీపీలో చేరికపై చెప్పకనే చెప్పారు. వైసీపీలో తాను చేరేది లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో శైలజానాథ్ మాట్లాడారు. జగన్ లీడ్ చేస్తున్న వైసీపీలో ఉన్న వారు అంతా కాంగ్రెస్ వారే అని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.

 

తాను కర్నూలులో ఒక పెళ్ళిలో జగన్‌ని కలసిన మాట వాస్తవమే అని అది మర్యాదపూర్వకంగా కలయిక జరిగిందని ఆయన తెలిపారు. జగన్‌తో తనకు చిరకాల పరిచయం ఉందని ఆయన ఎదురుపడితే తనను హగ్ చేసుకుంటారని తాను షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతానని శైలజానాధ్ అన్నారు.వైసీపీలోనూ కాంగ్రెస్ ఉందని ఆయన అంటున్నారు.ఏపీలో 11 సీట్లు వచ్చినంతమాత్రన వైసీపీని తక్కువ అంచనా వేయలేమని నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే చిన్న విషయం కాదని శైలజానాథ్ అన్నారు.

 

23 సీట్లు వచ్చిన టీడీపీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన గుర్తు చేశారు. మరో అయిదారు శాతం ఓట్లు అటు నుంచి ఇటు మళ్ళితే అధికారం మారుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇన్నీ చెప్పిన ఆయన తాను మాత్రం వైసీపీలో ఎపుడు చేరుతున్నది మాత్రం వెల్లడించలేదు. తాను అన్నీ ఆలోచించుకోగలనని మాత్రమే అన్నారు. జగన్ జిల్లాల పర్యటన సమయంలో శైలజానాథ్ వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Posted Under AP
Editor