కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రo మల్లారెడ్డిపేట లో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- అక్టోబర్ 20 ఆదివారం రోజున గంభీరావుపేట మండల మల్లారెడ్డిపేటలో కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, వైస్ చైర్మన్ పాతూరు అంజిరెడ్డి పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి చేతుల మీద వరి ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని మల్లారెడ్డిపేటలో ప్రారంభించడం జరిగింది ,

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన సన్న వడ్లు కు 500 రూపాయలు బోనస్ తొ పాట పంటకు సరైన మద్దతు కలిపిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు తూకం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొవడం జరుగుతుంది గత పాలకులు రైతులను తూకం విషయంలో అనేక మొసాలు దోపిడీలు చేసి సొమ్ము చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతుల పక్షపాతిగా మునుపటిలాగా రైతులకు దళారీ బెడద ఉండదని పండించిన పంట ఒక్క గింజ కూడా పక్కా దారిలో పడకుండా అవినీతి జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు కొనుగోలు సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వ అధికారులతో సమీక్షిస్తూ ప్రజాపాలన ‌సాగుతుందని భరోసా కల్పించారు వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఎవరైనా అవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు,

రైతులు దళారుల మాటలకు మోసపోవద్దని పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రంలోనే విక్రయించు కోవాలని రైతులకు ఈ సందర్భంగా విన్నవించారు,

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి ,కేడీసీసీ వైస్ చైర్మన్ గాండ్ల రాజం, PACS కొత్తపెళ్లి సెక్రటరీ రాజయ్య గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ (గౌరీ) శంకర్, రమేష్ రెడ్డి రాజు గ్రామ శాఖ ఎస్సీ సెల్ ఆంజనేయులు, డైరెక్టర్లు బాల్ రెడ్డి లక్ష్మణరావు రాజం ప్రభాకర్ లింగం రాజనర్సు, అజాం విట్టల్ గంగరాజు గౌడ్ సత్తయ్య కృష్ణమూర్తి రాజారాం రెడ్డి బంగ్లా రాజు రాజశేఖర్ కొక్కురాజ్యం లచ్చయ్య లు మరియు పార్టీ శ్రేణులు రైతులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Editor