గంభీరావుపేట లొ ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు..

INC:- అక్టోబర్ 2 బుదవారం రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల అధ్యక్షులు యుండి హమీద్ గారి అద్వార్యంలొ గంభీరావుపేట ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది ,

ఈ సందర్భంగా హమీద్ గారు మాట్లాడుతూ నాడు భారత దేశానికి పీడల వ్యవహరించిన ఆంగ్లేయుల అరాచక పాలనను దురాగతాలను శాంతియుత పొరాటంతొ తరిమికొట్టి ఈ దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని అందించినటు వంటి మహానేత బాపూజీ, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు ,వారి త్యాగాలను ఎప్పటికీ ఎవ్వరు మరువలేనివని ఈ సందర్భంగా వారు కొనియాడారు,

ఈ కార్యక్రమంలో హమీద్ గారితో పాటు సోషల్ మీడియా కన్వీనర్ (గౌరీ శంకర్, సీనియర్ నాయకులు రాజ్వీర్, యవ నాయకులు,రాజశేఖర్ కోట లింగం,అక్క పెళ్లి బాలయ్య, అజ్మీర భాస్కర్, చంద్రం యాదవ్, పెద్దివేని మల్లయ్య, లక్కం నాంపల్లి, ఎడబోయిన ప్రభాకర్, మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు,

Editor