మదనపల్లెలో ఏం జరిగిందో మర్యాదగా చెప్పండి, ప్రత్యేక కమిటీ వేసిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి (ఉమ్మడి చిత్తూరు జిల్లా) సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై కూటమి ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయని సమాచారం.

 

మదనపల్లె సబ్ కలెక్టర్ గా నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు సైతం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై చాలా సీరియస్ అయ్యారు. అసలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిజంగా అగ్నిప్రమాదం జరిగిందా, కుట్ర పూరితంగా కావాలనే కార్యాలయానికి నిప్పంటించారా అనే అంశంలో విచారణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు

.

 

Posted Under AP
Editor