- వృద్ధులకు నేరుగా దర్శనం
- శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు ఈవో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు
- చార్మినార్ ఎక్స్ ప్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ:భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు ఈవో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఇకపై 60ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులు, వారికి సాయంగా వచ్చేవారు నేరుగా దర్శించుకోవచ్చు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు బేడా మండపంలో వేచి ఉండేందుకు వీరికి సదుపాయాలు కల్పిస్తారు. ప్రొటోకాల్ అర్హత ఉన్నవారి కోసమూ ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆఫీసులో వివరాలు అందించి కోరుకున్న దర్శనం, పూజ చేయించుకోవచ్చు.
