సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..!

దేశ వ్యాప్తంగా శనివారం సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగియగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. వివిధ సర్వేలు ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటన్నిటి ఆధారంగా దేశంలో ఎవరు అధికారంలోకి రానున్నారో అంచనా వేశారు.

 

ముచ్చటగా మూడో సారి కూడా ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని దాదాపు అన్ని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. ఎన్డీఏ కూటమి గరిష్టంగా 390 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. రిపబ్లిక్ – పీమార్క్, ఇండియా న్యూస్ – డీ డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ – మ్యాట్రిజ్ చేసిన సర్వేలు 300 పైగా స్థానాలు కాషాయ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి.

 

ఇండియా న్యూస్ – డీ డైనమిక్స్ సర్వే :

 

ఎన్డీఏ: 371

ఇండియా కూటమి: 125

ఇతరులు: 47

 

రిపబ్లిక్ టీవీ – PMARQ సర్వే:

 

ఎన్డీఏ కూటమి: 359

ఇండియా కూటమి: 154

ఇతరులు: 30

 

జన్‌కీ బాత్ సర్వే :

 

ఎన్డీఏ : 362 – 395

ఇండియా కూటమి :141- 161

ఇతరులు : 10- 20

 

రిపబ్లిక్ భారత్ – మాట్రిజ్ సర్వే:

 

ఎన్డీఏ: 353- 368

ఇండియా కూటమి: 118- 133

ఇతరులు: 43- 48

 

న్యూస్ నేషన్స్ సర్వే:

 

ఎన్టీఏ: 342 – 378

ఇండియా కూటమి: 153- 169

ఇతరులు: 21- 23

 

NDTV సర్వే:

 

ఎన్డీఏ : 365

ఇండియా కూటమి: 142

ఇతరులు: 36

 

దైనిక్ భాస్కర్:

 

ఎన్డీఏ: 281- 350

ఇండియా కూటమి: 145 – 201

ఇతరులు : 33- 49

Editor