Latest Posts

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు.

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు..

ఉదయం 9 గంటల నుంచే

భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని కోరారు ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు

పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆవసరమైతెనే ఇండ్ల నుంచి బయటకు రావాలని లేక పోతే రావద్దని పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు సూచించారు..

Editor