తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. సంక్షేమ పథకాల అమలులో ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలోనే ఫలించబోతోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం(మార్చి 12న) నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు కమిటీని నియమిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ పినాకిని చంద్రబోస్‌ను విచారణ కమిటీ చైర్మన్‌గా నియమించారు. 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనోగుళ్లపైనా విచారణ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో 93 శాతం రైతులకు రైతుబంధు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త..
