ప్రెస్ నోట్;
ది:28/02/2024,
మణుగూరు;
డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్ ల పంపిణీ….
మణుగూరు పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం లో జరిగిన దివ్యాంగుల వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో 15 మంది దివ్యాంగులకు డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ ఫౌండింగ్ నెంబర్ బయ్యన బాబు రావు చేతుల మీదుగా వీల్ చైర్స్ ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ బయ్యన బాబురావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలకు హాస్పిటల్స్ కు అలాగే నిరుపేద వాళ్ళకి దాదాపుగా 9 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్టు తెలియజేశారు. అనేక పాఠశాలలో డిజిటల్ క్లాసెస్ ని అలాగే హాస్పిటల్స్ లో కావలసినటువంటి మౌలిక సదుపాయాలని కరోనా టైంలో హాస్పిటల్స్ కావలసినటువంటి వివిధ పరికరాల్ని ఎన్నారై ఫౌండేషన్ అందించిందని అలాగే ఎవరైతే పేదరికంలో ఉండి వారికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారో, అలాంటివారికి వీల్ చైర్స్ రూపంలో గానీ, కుట్టుమిషన్ల రూపంలో ,తోపుడుబండ్ల రూపంలో స్థానిక సంస్థల స్థానిక సామాజికవేత్తల సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక పూజారి ,సామాజికవేత్త గిరి ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ భద్రాద్రి జిల్లా ప్రతినిధి, టీచర్ తుక్కానీ శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు,నరేష్, గుడిపుడి కోటేశ్వరరావు, గాండ్ల సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.
