నామినేషన్లు ఓకే.. ఇంతకీ సీట్లు ఎవరికి..?

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో నామినేషన్‌ పదవులపై అనేకమంది ఆశలు పెట్టుటకున్నారు. 56 నామినేషన్‌ పోస్టుల భర్తీ ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌గా మారింది. అయితే ఆయన తను ఇబ్బంది పడకుండా భారాన్ని అధిష్టానంపైనే వేస్తున్నారు. ఎవరికి పదవి అంటే వారికి ఇవ్వడానికి సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు పిబ్రవరి 5న ఢిల్లీ వెళ్లిన సీఎం ఈ విషయమై అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది.

 

లైన్‌లో వీరు..

నామినేటెడ్‌ పదవి ఆశిస్తున్న వారిలో దాదాపు వంద మంది వరకు ఉన్నారు. కానీ ఉన్న పదవులు 56 మాత్రమే. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి, ఎస్సీసెల్‌ చైర్మన్‌ ప్రీతమ్, ఎస్టీ సెల్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్, ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మెట్టు సాయి, ఓబీసీ సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్, ప్రొటోకాల్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ తదితరులు నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నారు. వీరితోపాటు పీసీసీ కార్యదర్శులు, చరణ్‌ భవనీరెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, యెన్నెం శ్రీకాంత్‌రెడ్డి, చిలక మధుసూదన్‌రెడ్డి, కైలాశ్‌నేత, వెంకటేశ్వర్లు, వెంకటే శ్‌యాదవ్, బచన్‌కుమార్, శ్రీకాంత్‌యాదవ్, కొత్తగా పార్టీలో చేరే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పదవులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘంగా పనిచేస్తున్నవారు కూడా పదవులపై ఆశతో ఉన్నారు. వీరికి కూడా 56 పదవుల్లోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. మరి కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నాయకత్వం వీరిని ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.

Editor