టచ్ చేసి చూడు.. సీఎం రేవంత్‌పై కేసీఆర్ హాట్‌ కామెంట్స్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కేఆర్‌ఎంబీపై తెగించి కొట్లాడాలని నాయకులకు సూచించారు. తుంటి ఎముక శస్త్ర చికత్స తర్వాత తొలిసారి మంగళవారం తెలంగాణ భవన్‌కు వచ్చారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర‍్వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందన్నారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని తెలిపారు. ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాని రద్దు చేసి తీసుకోవాలని చెప్పానన్నారు.

Editor