మార్కెట్‌లోకి ‘భారత్‌ రైస్‌..’

భారత్‌ రైస్‌ను కేంద్రం మొదట భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(ఎన్‌ఏఎఫ్‌ఈడీ), భారతీ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్‌సీసీఎఫ్‌) ద్వారా ముందుగా విక్రయించాని నిర్ణయించింది. భారత్‌ రైస్‌ ఇప్పుడే కావాలనుకునేవారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చు. ఈ సైట్‌లో లాగిన్‌ అయి భారత్‌ రైస్‌తోపాటు పప్పు, పంచదార, శనగలు ఇలా చాలా ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

 

ఇలా అందుబాటులో..

భారత్‌ రైస్‌ను కేజీ రూ.29కే కేంద్రం విక్రయిస్తుంది. ఈ రైస్‌ 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో లభిస్తాయి. ఈ రైస్‌తోపాటు గోధుమ పిండిని కిలో రూ.27.50కు, శనగ పప్పు కేజీ రూ.60కి నాఫెడ్‌లో అమ్ముతున్నారు. నాఫెడ్‌తోపాటు ఇతర ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సైట్లలో కూడా భారత్‌రైస్‌ అందుబాటులో ఉంది. నాఫెడ్‌లో కొనుక్కోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, ఆ తర్వాత లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

Editor