అయోధ్య రామమందిరానికి భారీగా విరాళాలు.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయో తెలుసా..?

త్వరలో ఆలయ ప్రారంభోత్సవం..

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో రామలాలాకు పట్టాభిషేకం జరగడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా రామభక్తులు రామాలయ నిర్మాణానికి భారీగా విరాళాలు ఇచ్చారు. విరాళాల వడ్డీతోనే ఆలయంలో మొదటి అంతస్తు నిర్మాణం పూర్తవుతుంది.

 

దేశంలోని 11 కోట్ల మంది విరాళం..

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 11 కోట్ల మంది అయోధ్య రామాలయానికి రూ.900 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు రామమందిర్‌ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకోగా గత డిసెంబర్‌ వరకు రూ.5 వేల కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. 18 కోట్ల మంది రామ భక్తులు నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విరాళాలు జమ చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కూడా డబ్బులు జమ చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాల్లోనే దాదాపు రూ.3,200 కోట్లు జమయ్యాయి.

 

విరాళాలకు వడ్డీ..

ట్రస్ట్‌ ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా ఇచ్చిన డబ్బును ఎఫ్‌డీ చేసింది. దానిపై వచ్చిన వడ్డీ నుంచి ఆలయం యొక్క ప్రస్తుత రూపం నిర్మించబడింది. అయితే రామునిపై ఉన్న భక్తితో విరాళాలు ఇచ్చేందుకు ఇప్పటికి దాతలు ముందుకొస్తున్నారు.

 

ఎక్కువ విరాళం ఇచ్చింది వీరే..

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం, ఆధ్యాత్మిక గురువు మరియు కథకుడు మొరారీ బాపు అయోధ్యలో నిర్మించబడుతున్న గొప్ప రామ మందిరానికి ఇప్పటివరకు అత్యధిక విరాళం ఇచ్చారు. మొరారీ బాపు రామ మందిరానికి రూ.11.3 కోట్లు విరాళం ఇచ్చారు. అమెరికా,కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉన్న అతని అనుచరులు ఏకంగా రూ.8 కోట్లు విడివిడిగా విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్‌ ధోలాకియా రామ మందిర నిర్మాణానికి రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. గోవింద్‌భాయ్‌ ధోలాకియా అనే డైమండ్‌ కంపెనీ శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని.

 

మొదటి విరాళం అతనిదే..

ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్ని అంటే డబ్బు సేకరణ ప్రచారాన్ని అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2021, జనవరి 14 ప్రారంభించారు. రామ మందిరానికి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి రామ్‌నాథ్‌ కోవింద్‌. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెక్కు ద్వారా రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. విదేశీ విరాళాల విషయానికి వస్తే అయోధ్య ఆలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలో ఉన్న రామభక్తుడు (పేరు వెల్లడించలేదు) గతంలో ఆలయ ట్రస్టుకు విరాళంగా రూ.11 వేలు పంపించాడు.

Editor