వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..!!.

సర్వర్‌ సమస్యతో జాప్యం..

ఇదిలా ఉండగా పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు సర్వర్‌ సమస్య ఆటంకంగా మారింది. బుధవారం చాలా మంది ఈ చలాన్‌ సైన్‌ ఓపెన్‌ చేయడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో చలాన్లు చెల్లింపుకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో గడువు పొడిగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం గడువును ఈనెల 31 వరకు పొడిగింది. అంటే మరో 20 రోజులపాటు ఈచలాన్లు రాయితీపై చెల్లించవచ్చు. కేసీఆర్‌ ప్రభుత్వం 2022లో మార్చి 1 నుంచి 31 వరకు రాయితీ కల్పించింది. ఆ తర్వాత మరో 15 రోజులు గడువు పెంచింది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్‌ 26 నుంచి రాయితీ కల్పించింది. జనవరి 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దానిని తాజాగా జనవరి 31 వరకు పొడిగించింది. ఈలోపు వాహనాదారులు తమ పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ చేసుకోవాలని సూచించింది.

 

డిస్కౌంట్లు ఇలా..

గతనెల 26న ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. తమ వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లించాలని అనుకునేవారు https://echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి వాహనాల నంబర్‌ ఎంటర్‌ చేయగానే పెండింగ్‌ చనలాన్ల వివరాలు వస్తాయి.

 

= పుష్‌ కార్ట్‌ల కోసం (39 B కేసులు) 10 శాతం చెల్లించాలి. 90 శాతం మినహాయింపు ఉంటుంది.

= ఆర్‌టీసీ డ్రైవర్లకు 90 శాతం మినహాయింపు ఇవ్వగా.. 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

= టూ వీలర్, త్రీ వీలర్‌కు 80 శాతం డిస్కౌంట్‌ ఇచ్చింది. 20 శాతం చెల్లించాలి.

= కార్లు, ఇతర వాహనాదారులు 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 60 శాతం మినహాయించింది.

Editor