బంగారు నగల దుకాణాల్లోకి చొరబడి దోపిడీలు,

బంగారు నగల దుకాణాల్లోకి చొరబడి దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పదే పదే వెలుగు చూస్తున్నాయి. తుపాకీ చూపించి బంగారు నగలు దోచుకున్న ఘటనలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఒక్కో అతిపెద్ద జ్యువెలరీ షాపుల్లో కూడా చోరీలు జరుగుతున్నాయి.

ప్రముఖ జ్యువెలరీ షోరూంలో రాత్రి వేళ చొరబడ్డ దొంగ ఏకంగా కోట్ల విలువైన బంగారు నగలు లూటీ చేశారు.

బంగారు నగల షోరూమ్ లో రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. బంగారు నగల షోరూమ్ లో దొంగతనం వీడియో సీసీటీవీలో రికార్డు అవ్వడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డిసెంబర్ 31వ తేదీన చోరీ జరిగింది. పూణెలోని ఆదివారం డౌన్‌టౌన్ ప్రాంతంలోని జ్యూవెలరీ షోరూమ్ లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు నగల దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నగల దుకాణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందించారు. రాత్రి పూట ఒక దొంగ పుల్ ఓవర్ తో పాటు అతని శరీరం కనపడకుండా బట్టలు వేసుకున్నాడు. ముఖానికి మాస్క్, ఫుల్ ఓవర్ కప్పుకుని నగల దుకాణం తలుపులు పగులగొట్టిన దొంగ సులువుగా లోపలికి ప్రవేశించి లాకర్ లో ఉంచిన బంగారు ఆభరణాలను బయటకు తీసి అతను తెచ్చిన బ్యాగులో నింపాడు.

అనంతరం బ్యాగులో 10 లక్షల నగదు నింపాడు. నగదు సహా రూ. 3 కోట్ల విలువైన 5 కిలోల బంగారు ఆభరణాలను అపహరించాడు. లాకర్‌లోని బంగారు ఆభరణాలన్నింటినీ దొంగిలించి ఎలాంటి ఆందోళన లేకుండా దర్జాగా చోరీ చేసి బటయకు వెళ్లిపోయాడని సీసీటీవీల్లో రికార్డు అయ్యింది.

బంగారు నగల షోరూమ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు దొంగతనం చేసిన నిందితుడు అదే జ్యువెలరీ షాపులోని పని చేసే సిబ్బంది సాయం తీసుకుని ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Posted Under AP
YES9 TV